ఇస్రో కోసం రెండు ఉపగ్రహ రూపకల్పన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు అనంత్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇవి 400 కిలోల తరగతికి చెందిన ఉపగ్రహాలు కావడం ప్రత్యేకత. తొలిసారిగా ఈ ప్రాజెక్టును ఇస్రో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అనంత్ టెక్నాలజీస్ తన బెంగళూరు ఏరోస్పేస్ పార్క్లో, ఈ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ (AIT) కార్యకలాపాలను పూర్తి చేసింది. వీటిని ఇస్రోకు లాంఛనంగా అప్పగించారు.