ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు లక్ష్మిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. లక్ష్మిని చంపేందుకు యత్నించగా.. ఆమె కొడుకు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ కొడుకుని కొట్టి అతని కళ్లెదుటే లక్ష్మిని దుండగులు నరికి చంపారు. అయితే లక్ష్మికి గతంలో నక్సలైట్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.