TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను ఏసీబీ గురువారం విచారించనున్న విషయం తెలిసిందే.