జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ గ్యారేజీలో మరో ఖరీదైన కారు చేరింది. రూ.3.99 కోట్ల ప్రారంభ ధరతో లభిస్తున్న ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును కొన్నారు. ఇప్పటివరకు ఎవరూ ఈ కారును కొనుగోలు చేయలేదు. దీంతో దాన్ని సొంతం చేసుకొన్న మొదటి వ్యక్తిగా గోయల్ నిలిచారు. కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.