TG: బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఈ రోజు బీజేపీ ఇండియా లిమిటెడ్.. దేశాన్ని దోచుకుంటోందని అన్నారు. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. అదానీ, అంబానీలతో బీజేపీ దోపిడీ చేయిస్తోందని, బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీలో దోపిడి ఉండదని తెలిపారు.