ప్రతి శీతాకాలంలో భారతదేశం వలస పక్షులకు తమ సంతానోత్పత్తి ప్రదేశాలలోని కఠినమైన శీతాకాలాల నుంచి తప్పించుకునే స్వర్గధామం అవుతుంది. వాటి స్వస్థలాల్లో వాతావరణం ఇబ్బందిగా ఉండటం వల్ల కొన్ని పక్షులు వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు వస్తుంటాయి. వాటిలో సైబీరియన్ క్రేన్, డన్లిన్, బార్ హెడెడ్ గూస్, నార్తర్న్ పిన్‌టెయిల్, కామన్ రెడ్‌షాంక్, గ్రేటర్ ఫ్లెమింగో, రోజీ పెలికాన్ తదితర పక్షులు ఉన్నాయి.