హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు

58చూసినవారు
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు
హైదరాబాద్ కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద ఓ ఆటో బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. అతడి అవయవ దానానికి ఒప్పుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్