మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

61చూసినవారు
మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత
ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. తాజాగా మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తోన్న వివిధ టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు గ్రీక్‌వైర్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని తొలగించిందనేది వెల్లడి కాలేదు. కాగా, మైక్రోసాఫ్ట్‌ తొలగింపులు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. మొత్తంగా గతేడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్