AP: బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండిలోగా అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.