భారత విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించబోతోంది. దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు ‘శంఖ్ ఎయిర్'కు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు DGCA ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు శంఖ్ ఎయిర్ పేర్కొంది.