విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయం: పవన్

83చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయం: పవన్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 'ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మోదీ దృక్పథం. 1966లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన అమృతరావు, వేలాది మంది త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది' అని పవన్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్