AP: ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు. అసత్య కథనాలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు యత్నింస్తున్నారు. జలాల పంపిణీపై 2023లో ఆర్డర్ ఇస్తే జగన్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను జగన్ వదులుకున్నారని ఆరోపించారు.