విశాఖ‌కు మ‌రో వందేభార‌త్.. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ

79చూసినవారు
విశాఖ‌కు మ‌రో వందేభార‌త్.. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ
విశాఖకు మరో వందేభారత్ రైలు రానుంది. సెప్టెంబ‌ర్ 15న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దీన్ని ప్రారంభించ‌నున్నారు. అయితే సెప్టెంబ‌ర్ 15న మాత్రం ఈ రైలు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ‌పూర్ నుంచి విశాఖ‌ప‌ట్నం మ‌ధ్య న‌డుస్తుంది. ఆ త‌రువాత నుంచి రోజూ ఉదయం 6గంటలకు దుర్గ్ (ఛ‌త్తీస్‌గ‌ఢ్‌) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. ఈ రైలు రాయ‌పూర్‌, ల‌ఖోలి, టిట్లాఘ‌ర్, రాయ‌గ‌డ‌, విజ‌య‌న‌గరం మొత్తం 5 స్టేషన్లలో ఆగనుంది.

సంబంధిత పోస్ట్