జమ్మూకశ్మీర్ రాజౌరీలోని బధాల్‌లో ఇటీవలి కాలంలో మూడు కుటుంబాల్లో 17 మంది అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే వారి మృతి గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే గ్రామంలో ఉన్నతస్థాయి కేంద్ర బృందం పర్యటించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తాజాగా వెల్లడించారు.