ఏపీ సీఎం చంద్రబాబు తన బృందంతో కలిసి నేడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నారు. దావోస్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుండడంతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగనుంది. రాత్రికి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లి అక్కడ భారత రాయబారితో భేటీ కానున్నారు. అనంతరం ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ అయి రాష్ట్రంలో గల మౌళిక వసతుల గురించి వివరించనున్నారు.