నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.