రష్యాలో అపార్ట్‌ మెంట్‌ కూలి 13 మంది మృతి (వీడియో)

78చూసినవారు
రష్యాలోని బెల్గోరోడ్ నగరంలో ఆదివారం ఓ విషాద ఘటన జరిగింది. 10 అంతస్తుల అపార్ట్‌మెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టి 13 మృతదేహాలను వెలికి తీసి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్ కూలిపోవడానికి ఉక్రేనియన్ షెల్లింగ్ కారణమని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్