బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం

54చూసినవారు
బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం
రాజస్థాన్ లోని దుంగార్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి తనకు కాబోయే భర్త కోసం బంధువుతో కలిసి బైకుపై వెళ్తుండగా దారిలో బైక్ పంక్చర్ అయ్యింది. ఇంతలో ముగ్గురు యువకులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేసి ప్రభుత్వ స్కూల్లోకి ఎత్తుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో వారు పారిపోయారని తెలుస్తోంది. జరిగిన విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్