నేడు ఆరాంఘర్‌ - జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభం

73చూసినవారు
నేడు ఆరాంఘర్‌ - జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభం
TG: ఆరాంఘర్‌ - బహదూర్‌పుర జూపార్కు వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జూపార్కు ఎదురుగా ప్రారంభించనున్నారు. HYD నగరంలోనే ఈ వంతెన రెండో అతి పెద్దది. దాన్ని 3.9 కిలోమీటర్లు, ఆరులైన్లతో విస్తరించారు. ఎస్‌ఆర్‌డీపీ నిధులు రూ.360 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణతో కలిపి రూ.799 కోట్లు వ్యయం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్