దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదిత చట్టంలో చేర్చాలన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలని లేఖలో వివరించారు.