అమితాబ్‌‌పై అశ్వనీదత్‌ ప్రశంసలు

82చూసినవారు
అమితాబ్‌‌పై అశ్వనీదత్‌ ప్రశంసలు
బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ప్రశంసలు కురిపించారు. ‘కల్కి’ ఈవెంట్‌లో ఆ అగ్ర నటుడు చేసిన పనికి తాను ఆశ్చర్యపోయానన్నారు. అమితాబ్ తన కాళ్లు టచ్ చేసే ప్రయత్నం చేయగా తాను అయోమయానికి గురయ్యానన్నారు. ‘వెంటనే తేరుకొని ఆయన పాదాలను నేనూ తాకే ప్రయత్నం చేశా. అమితాబ్‌.. ఇండియన్‌ సినిమా యోధుడు, ఓ లెజెండ్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్