రాముడి ‘ప్రాణ ప్ర‌తిష్ఠ’వేళ.. విదేశీ క్రికెట‌ర్ల స్పందన

59చూసినవారు
రాముడి ‘ప్రాణ ప్ర‌తిష్ఠ’వేళ.. విదేశీ క్రికెట‌ర్ల స్పందన
బాల రాముడి ప్రాణప్ర‌తిష్ఠ వేడుక ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఈ కార్యక్రమం అద్భుత‌మంటూ విదేశీ క్రికెట‌ర్లు నెట్టింట స్పందించారు. పాకిస్థాన్ మాజీ స్పిన్న‌ర్ డానిష్ క‌నేరియా స్పందిస్తూ వందల ఏండ్ల నిరీక్ష‌ణకు తెర‌ప‌డింది. వాగ్దానం ముగిసిందని రాసుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుక శుభాకాంక్ష‌లు తెలిపాడు. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ జై శ్రీ‌రామ్ అంటూ పోస్ట్ పెట్టాడు.

సంబంధిత పోస్ట్