అల్జీమర్స్ వ్యాధి ఎందుకొస్తుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. మెదడులో ప్రొటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. పలు సందర్భాల్లో 40–50 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది.