మంత్రి వర్గంలో చంద్రబాబు ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యతనిచ్చారు. టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంతో విజయవాడ వరద బాధితులకు విరాళాలు ఇవ్వడంలో సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సీనియర్ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ నేతలు విరాళాలు ఇవ్వడంతో పాటు ఇతర నేతలను సైతం విరాళాలు ఇచ్చేలా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సీనియర్ల తీరు మారుతుందోమో చూడాలి.