హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘట్కేసర్ సమీపంలోని మేడిపల్లి పీఎస్ పరిధిలో మైనర్ బాలిక(14)ను కేశవరెడ్డి(36) అనే వ్యక్తి రూంలో బంధించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.