లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్‌సీసీ ఓ ప్రకటనలో కోరింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్లైట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, జూబ్లీహిల్స్ చిరునామాకు పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఫోన్ నంబరు 98499 72280, complaints@telugufilmchamber.in ద్వారా కంప్లైట్స్ ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది.