విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అక్కయ్యపాలెం వద్ద శ్రీనివాస్‌నగర్‌లో అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాడిలో యువతి శరీరం సగభాగం కాలిపోవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.