సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సహా దేశంలోని పలు రీజియన్లలో 723 డిఫెన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్‌మెన్-389, ఫైర్మెన్-247, మెటీరియల్ అసిస్టెంట్-19, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-27 సహా మరిన్ని పోస్టులున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా పాసైన 18–27 ఏళ్లలోపు వారు అర్హులు. DEC 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం నెలకు రూ.18 వేలు నుంచి రూ.92,300 వరకు ఇస్తారు.