తెలుగు రాష్ట్రాల ప్రజలను బుధవారం ఉదయం భూకంపం అతలాకుతులం చేసింది. అయితే ఇది భూమికి 5 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదే భూకంపం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే.. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని అన్నారు. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలంపైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయని, అందుకే పెద్ద నష్టాలు జరగలేదన్నారు.