ఒడిశాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ట్రైబల్ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. నవంబర్ 16న బాధిత మహిళ గ్రామంలోని చెరువులో స్నానం చేసి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన అభయ్ బాగ్ అనే వ్యక్తి ఆమె ఛాతీపై కొట్టి కింద పడేశాడు. కులం పేరుతో దూషిస్తూ బాధిత మహిళ ముఖంపై అభయ్ మలం పూసి.. బలవంతంగా దానిని తినిపించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.