BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కల్వకుంట్ల కవిత మామ, పార్టీ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్ కిషన్ రావు అపార్ట్మెంట్ పక్కనే ఉన్న తన 235 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు రామ్ కిషన్ రావు, అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారని.. గాధారి గోపి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ కిషన్ రావుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.