TG: తన స్థలానికి సంబంధించి వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చి వేయడాన్ని సవాలు చేస్తూ ముతంగికి చెందిన ప్రవీణ్ పిటీషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అన్ని పత్రాలు పరిశీలించాకే చర్యలు చేపట్టిందని హైడ్రా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.