‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఓసారి తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు అలా చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదని తెలిపింది.