ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి.. భర్త మృతి (వీడియో)

74చూసినవారు
ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి జరిగిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.  హమీర్‌పూర్‌ జిల్లాలోని ముస్కారా పట్టణంలో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం హంతకులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్