ఢిల్లీలోని సరోజినీ నగర్లో దేశంలోనే మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన బస్ డిపోను మంత్రి కైలాశ్ గెహ్లాట్ ప్రారంభించారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. మొత్తం 225 మంది సిబ్బంది ఈ డిపోలో పనిచేస్తారు. మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఇది ఒక ముందడుగు అని మంత్రి గెహ్లాట్ పేర్కొన్నారు.