తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టనున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 15న ఆటోల బంద్ కు షేక్ హ్యాండ్ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ పిలుపునిచ్చారు. 15న ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జేఏసీ స్పష్టం చేశారు.