జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకున్న 'ఆట్టమ్'

598చూసినవారు
జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకున్న 'ఆట్టమ్'
70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఆనంద్ ఎకార్శి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'ఆట్టమ్' జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకుంది. ఉత్తమ తెలుగు సినిమాగా 'కార్తికేయ 2' జాతీయ అవార్డును సొంతం చేసుకోగా, ఉత్తమ హిందీ చిత్రంగా 'గుల్మోహర్', ఉత్తమ తమిళ చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్:1', ఉత్తమ మరాఠా చిత్రంగా 'వాల్వి' నిలిచాయి. 'K.G.F: చాప్టర్ 2' ఉత్తమ కన్నడ చిత్రంగా ఎంపికైంది.

సంబంధిత పోస్ట్