హైదరాబాద్ రోడ్లపై అయోధ్య రామ మందిరం కార్లు శనివారం పరుగులు పెట్టాయి. హైదరాబాదీ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకమైన ‘వాకీ కార్ మ్యూజియం’ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉన్న కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కారు తయారై రోడ్ల మీద పరుగులు పెడుతుంటే ప్రజల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.