ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2.4 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉండగా.. 80,480 ఆస్తులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ డేటా తెలిపింది. పంజాబ్‌లో 75,000కు పైగా, తమిళనాడులో 66,000కు పైగా, కర్ణాటకలో 65,000కు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. యూపీ, బీహార్‌లలో వేర్వేరు సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.