టీమిండియా తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా బహుతులె

76చూసినవారు
టీమిండియా తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా బహుతులె
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టుకు తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులె వ్యవహరించనున్నారు. ఆయన ప్రస్తుతం ఎన్‌సీఏలో సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి భారత బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ను నియమించే అవకాశముంది. కానీ శ్రీలంక సిరీస్‌ కోసం అతను అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా బహుతులెను ఎంపిక చేశారు. మాజీ లెగ్‌ స్పిన్నరైన బహుతులె భారత్‌ తరపున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్