వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో కీలక నిందితుడు సురేశ్‌కు గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు, షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సురేశ్‌ను ఆదేశించింది. అయితే ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి తీసుకొని సురేశ్‌ను వికారాబాద్ పోలీసులు విచారించారు.