బాలకృష్ణ యాక్షన్‌ @ రాజస్థాన్‌

54చూసినవారు
బాలకృష్ణ యాక్షన్‌ @ రాజస్థాన్‌
నందమూరి బాలకృష్ణ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రం ఇది. ఈ నెల 21 నుంచి రాజస్థాన్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. పోరాట ఘట్టాలు, టాకీ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్రని పోషిస్తున్నారు. సంగీతం తమన్, ఛాయాగ్రహణం విజయ్‌ కార్తీక్‌ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్