ఏపీలో వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.కోటి సాయం ప్రకటించారు. అయితే ఈ సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ' నిన్న విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాన్ని స్వయంగా చూశాను, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం తప్పిదం వల్లే వరదలు వచ్చాయి, కానీ నిందను మాపై వేసే ప్రయత్నం చేస్తున్నారు' అని జగన్ మండిపడ్డారు.