పుష్ప-2 సినిమాలో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింట చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటకు చిన్నా, పెద్దా తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కిస్సిక్ పాటకు బామ్మలు అదరగొట్టారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న కొందరు బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బామ్మలు వేసిన స్టెప్పులు అదిరిపోయాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.