అరటిపంట 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుని సాధారణ దిగుబడినిస్తుంది. ఈ పంటకు అధిక నీరు అవసరం అవుతుంది. అలా అని తోటలో నీరు నిల్వ ఉన్నా, అవసరానికి మించి నీరు ఇచ్చినా మొక్కలు తట్టుకోలేవు. భూమి నీటి నిల్వ సామర్థ్యంతో 25శాతం మేర తగ్గిన వెంటనే తడులు ఇవ్వాలి. భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 3-15 రోజులకోసారి నీరు పెట్టాలి. బిందుసేద్యం ద్వారా సాగు చేసే తోటల్లో నీటి యాజమాన్యంతో దిగబడులు సాధించొచ్చు.