హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆదర్శంగా నిలిచారు. శనివారం తన పుట్టిన రోజు కావడంతో జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులను తన ఇంటికి పిలిచి అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అలాగే వారితో కలిసి తాను భోజనం చేసి మంచి మనసును చాటుకున్నారు.