తెలంగాణలో ఒకే పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. రేవంత్ సర్కార్ అసమర్ధ విధానాలపై కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెటాలియన్లు విధుల బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు.