యూపీలోని సంభల్లో 1978లో మతపరమైన అల్లర్ల వల్ల మూతబడి 46 ఏళ్ల తరువాత వెలుగుచూసిన భస్మా శంకర ఆలయ తలుపులను తెరిచారు. సమీపంలోని బావిలో తవ్వకాలు జరపగా శిథిలమైన వినాయకుడు, కార్తికేయ సహా మరో విగ్రహం లభించింది. సంభల్ ప్రాంతంలో విద్యుత్ చౌర్యంపై అధికారులు తనిఖీ చేపట్టగా ఈ ఆలయం వెలుగుచూసింది. ఆలయంలో సోమవారం హారతి కార్యక్రమాలు నిర్వహించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.