AP: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న దానిపై 10 నుంచి 15 శాతం వరకు విలువ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు ఉత్తర్వులిచ్చారు.