సినారె సికింద్రాబాద్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి తన అధ్యాపక జీవనాన్ని ప్రారంభించారు. ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయము ప్రయోగాలు’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ లెక్చరర్ నుంచి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఆ తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షులుగానూ, ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గానూ, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గానూ తన విశిష్ట సేవలను అందించారు.